okamaata chaalu thandri ఒకమాట చాలు తండ్రీ
ఒకమాట చాలు తండ్రీ
నీ చల్లనైన నోట
నా జన్మ తరియించును
నా ఆశ ఫలియించును
మమతలు పంచే లోకంలో
మంచికి కరువైపోయింది
ప్రేమను పంచే హృదయంలో
ద్వేషం గూడులు వేసింది
అట్టి హృదయాలను ముట్టి మార్చాలని
నిత్యము సాక్షిగా నీకై నిలవాలని
లోకంలో నీ ప్రజలంతా
నీ ప్రేమను గుర్తించాలి
నిను ద్వేషించే వారంతా
రక్షణలోనికి రావాలి
అందరం ఏకమై నిన్ను కొలవాలని
శుద్ధ హృదయాలతో నిన్ను చేరాలని