ontari payanamlo evaru lekunnaa ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా
ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా
అందరు నను విడిచి దూరంపోతున్నా
నీవే తోడుండగా నీ సన్నిధి వెంటుండగా
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు
ఎడారిలో గూడబాతునై
రెక్కలు తెగిన పక్షినై
దారే కానరాకున్న గమ్యమే తెలియకున్నా
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు
దప్పికతో నీటివాగుకై పరుగెడుతున్న దుప్పికై
ఆశే ఇకలేకున్నా ధైర్యమే మిగులకున్నా
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు
ఓటమితో వట్టి మోడునై ఫలములులేని చెట్టునై
శ్వాసే ఆగిపోతున్నా ప్రాణమే మిగులకున్నా
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు