konumu maa hrudhaymbu lanu neeకొనుము మా హృదయంబు లను నీకర్పిం
కొనుము మా హృదయంబు లను నీకర్పించెద మనయము నుతి
యించుచు ఘనముగాఁ గృపచేత మముఁ గా చినను మే మెంతయు
ననర్హుల మనుచు నీ పాదముల కెరగుచు ననిశమును నీ కృపఁ
దలంతుము ||కొనుము||
1. బలహీనులము మేము బలవంతుఁడవు నీవు బల మిచ్చి మము
నడుపుము ఇలను మే మిఁక బ్రతుకు దివనం బులను నీ పద భక్తిచే
నెపుడలయ కుండగ మమ్ముఁ గడు ని ర్మలిన హృదయులఁ జేసి కరుణను
||కొనుము||
2. ఘోరారణ్యము భువి వి చార సంకలితము భూరి భయంకరము దారి
లేదిఁక నీవు దప్ప వేరె సాధన మెచెటఁ గానము కోరి మము నందరిని
నీదరి జేరుకొను మార్గమును జూపు ||కొనుము||
3. గత వత్సరమున నీ యతులమౌ కృపచేత పతితుల మముఁ గాచితి
వతి వినమ్రుల మగుచు మామా మతులలో నీ ప్రేమఁ దలఁచుచు మతి
విహీనతే వీడి యిఁక నిను సతతతము సేవింతు మయ్య ||కొనుము||
4. ఈ వత్సరంబున నెవ్వరు మాలోన పోవుదు రిలను విడిచి దేవ
వారలు భువిని వదలి పోవు కాలమునందుఁ దిన్నని త్రోవలో వారలను
సుఖముగఁ బ్రోవఁ దొడ్కొని పోవు మయ్య ||కొనుము||
5. మమ్మును విశ్వాస మార్గమందున దోడ నిమ్ముగఁ గొని పోవుచు
నమ్ము నీ ప్రియ సేవకుల బృం దమ్మునకు సిద్ధంబులగు మకు టమ్ములను
మే మొందుటకు వే గమ్ముగాఁ బాత్రులను జేసి ||కొనుము||
6. శోధనల యందున బాధల యందున నోదార్పు మా కొసఁగుము
శోధనలచే మాకు మరియును శుద్ధమగు హృదయంబు లిచ్చుచు శోధనల్
ఫలియిపంఁ జేయుము బాధకమ్ములు గాక యుండఁ ||కొనుము||
7. ఈ లోక దుఃఖము లెల్ల నేగిన పిదప నీ లోకమును జేరఁగఁ
పాలుమాలక మేము మామా పరుగు నెత్తఁగు సాయ మిమ్మో యేలికా నీ
కరములను మ మ్మెపుడు గొని నడువంగ నేర్పు ||కొనుము||
8. దురితంబు లెల్లను గరుణచేఁ గడిగి నీ పరమందు మము జేర్పుము
నిరతమును మే మచట నీ కృప విరివి నెంతయు బొగడుచును మా
కరములను బంగారు వీణెల వెరవుగాఁ గొని మీటుచుందుము ||కొనుము||
konumu maa hrudhayMbu lanu neekarpiMchedha manayamu nuthi
yiMchuchu ghanamugaaAO grupachaetha mamuAO gaa chinanu mae meMthayu
nanarhula manuchu nee paadhamula keraguchu nanishamunu nee krupAO
dhalMthumu ||konumu||
1. balaheenulamu maemu balavMthuAOdavu neevu bala michchi mamu
nadupumu ilanu mae miAOka brathuku dhivanM bulanu nee padha bhakthichae
nepudalaya kuMdaga mammuAO gadu ni rmalina hrudhayulAO jaesi karuNanu
||konumu||
2. ghoaraaraNyamu bhuvi vi chaara sMkalithamu bhoori bhayMkaramu dhaari
laedhiAOka neevu dhappa vaere saaDhana mechetAO gaanamu koari mamu nMdharini
needhari jaerukonu maargamunu joopu ||konumu||
3. gatha vathsaramuna nee yathulamau krupachaetha pathithula mamuAO gaachithi
vathi vinamrula maguchu maamaa mathulaloa nee praemAO dhalAOchuchu mathi
viheenathae veedi yiAOka ninu sathathathamu saeviMthu mayya ||konumu||
4. ee vathsarMbuna nevvaru maaloana poavudhu rilanu vidichi dhaeva
vaaralu bhuvini vadhali poavu kaalamunMdhuAO dhinnani throavaloa vaaralanu
sukhamugAO broavAO dhodkoni poavu mayya ||konumu||
5. mammunu vishvaasa maargamMdhuna dhoada nimmugAO goni poavuchu
nammu nee priya saevakula bruM dhammunaku sidhDhMbulagu maku tammulanu
mae moMdhutaku vae gammugaaAO baathrulanu jaesi ||konumu||
6. shoaDhanala yMdhuna baaDhala yMdhuna noadhaarpu maa kosAOgumu
shoaDhanalachae maaku mariyunu shudhDhamagu hrudhayMbu lichchuchu shoaDhanal
phliyipMAO jaeyumu baaDhakammulu gaaka yuMdAO ||konumu||
7. ee loaka dhuHkhamu lella naegina pidhapa nee loakamunu jaerAOgAO
paalumaalaka maemu maamaa parugu neththAOgu saaya mimmoa yaelikaa nee
karamulanu ma mmepudu goni naduvMga naerpu ||konumu||
8. dhurithMbu lellanu garuNachaeAO gadigi nee paramMdhu mamu jaerpumu
nirathamunu mae machata nee krupa virivi neMthayu bogaduchunu maa
karamulanu bMgaaru veeNela veravugaaAO goni meetuchuMdhumu ||konumu||