edho aasha naalo neethone jeevinchani ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ
ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ
యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ
మితిలేని ప్రేమ చూపించినావు
శృతి చేసి నన్ను పలికించినావు
ఈ స్తోత్రగానం నీ సొంతమే
పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము
పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక
కరుణామయా నా యేసయ్య
నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా
నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన
ప్రకటింతును నీ శౌర్యము
కీర్తింతును నీ కార్యము
చూపింతును నీ శాంతము
తేజోమయా నా యేసయ్య