ye reethiga kolichedha nee premalo nilichedha ఏ రీతిగా కొలిచెద నీ ప్రేమలో నిలిచెద
ఏ రీతిగా కొలిచెద – నీ ప్రేమలో నిలిచెద
ఇదే ఆశ మదిలో అనుదినం
ఇదే నా ప్రపంచం అనుక్షణం
సదా యేసు నీలో బ్రతికెద
ఏ రీతిగా కొలిచెద – ప్రభు నీ సేవలో నిలిచెద
ఇదే ఆశ మదిలో అనుదినం
ఇదే నా ప్రపంచం అనుక్షణం
సదా యేసు నీలో బ్రతికెద
ఏ రీతిగా కొలిచెద – ప్రభు నీ ప్రేమలో నిలిచెద
1. నీ మమతే – అమూల్యమైనదీ
ఊహలకే – అతీతమైనదీ
నా గతం – ఓడించగా
నీ దరే – చేరానుగా
పాపములో నన్ను – విడనాడక
విమోచించినా – నిజ దైవమా
ప్రార్ధనలే నాలో – ఫలియించగా
ప్రతీ శ్వాసలో – ప్రభవించవా
నీ ప్రేమ ఇలలో – పాడెద – నిరతం దేవా
2. నీ వరమే – విశేషమైనదీ
వాక్యముగా – వసించుచున్నదీ
నీ స్వరం – నా దీపమై
నీ బలం – ఆధారమై
ఆశ్రయమైనావు – కలకాలము
కృపాసాగరా – స్తుతి పాత్రుడా
శాశ్వత నీ ప్రేమ – వివరించుట
ఎలా సాధ్యమూ – ప్రియ యేసయా