yerugani reethigaa ఎరుగని రీతిగా
ఎరుగని రీతిగా
నను దర్శించే నీ కృప
ఇంతవరకు కాచెనే
చెంత నుండి నీ కృపా
అంతము వరకు నడిపించునే
అంతేలేని నీ కృప
కృప కృప కృప
గల గల పారే సెలయేరులా
నాలో ప్రవహించే నీ కృప
శిలనైనా నను కరిగించెనే
వెలయే లేని నీ కృప
పావనమైన జీవన యానములో
క్షేమము నిచ్చే నీ కృప
రమ్యమైన నీ ప్రేమతో
గమ్యము చేర్చే నీ కృప