entha kaalamo ee loka aasalapai dhyaasa ఎంత కాలమో ఈ లోక ఆశలపై ధ్యాస
ఎంత కాలమో ఈ లోక ఆశలపై ధ్యాస
ఇంకెంత కాలమో ఈ లోక భోగాల వేట
కాలం పరిపూర్ణమాయెను దుర్దినములు మొదలాయెను
ఇకనైనా కనులు తెరచుకో ఓ నేస్తమా
ఎలీషా తరువాత ప్రవక్తగా ఉండవలసిన గెహాజి
లోకాశలతో లాగబడి కుష్టి వ్యాధితో కృశియించే
ఏ దురాశతో ఈడ్వబడుచుంటివో ఓసారి యోచించుకో నేస్తమా
పండ్రెండుమంది అపోస్తులలో ఉండవలసిన ఆ యూదా
ధనాపేక్షతో లాగబడి ఉరి వేసుకుని మరణించే
ఏ దురాశతో ఈడ్వబడుచుంటివో ఓసారి యోచించుకో నేస్తమా
ఎంత కాలమో ఈ లోక ఆశలపై ధ్యాస
ఇంకెంత కాలమో ఈ లోక భోగాల వేట
కాలం పరిపూర్ణమాయెను దుర్దినములు మొదలాయెను
ఇకనైనా కనులు తెరచుకో ఓ నేస్తమా