oohinchalenu nee premanu naa ooha chaaladhaya ఊహించలేను నీ ప్రేమను నా ఊహ చాలదయ
ఊహించలేను నీ ప్రేమను నా ఊహ చాలదయ
వర్ణించలేను నీ మేలులు వర్ణనకందవయా
నా తల్లిలా నా యెడల
ప్రేమను చూపితివే
నాతండ్రిలా నాపక్షమై విజయమునిచ్చితివే
ఎన్నడైనా ఎడబాయక నను నడిపించితివే
వేదనలో నేనుండగా – చేతులుచాపి పిలచిన దేవ
ఆప్యాయతగా పలుకరించి కౌగిటిలో నను దాచితివయ్య
నా భారమంతా నీవే మోసినావు
నా కన్నీటిని నీవే తుడిచినావు
నాదేవ నీ కృపకు నేను పాత్రుడనా…..
దీనతలో దైర్యమునిచ్చి బలము నొసగిన
నా యేసయ్య
ఆత్మీయుడవై నా పక్షమై ధ్వజముగా
నీవు నిలిచితివయ్య
యోగ్యత లేకున్నా ఎన్నడు విడువక
ప్రతీ క్షణము నాతోనే ఉంటివే
నా దేవా నీ కృపకు నేను పాత్రుడనా…..