unnaanayaa nenunnaanayya ఉన్నానయా నేనున్నానయ్యా
ఉన్నానయా నేనున్నానయ్యా
నీ ప్రేమ వలనే ఇలా ఉన్నానయా
ఉంటానయా నే ఉంటానయ్యా
నా బ్రతుకంతా నీ కొరకే ఉంటానయా
నా మనసంతా నీవే
నా బ్రతుకంతా నీవే
నా ప్రతి శ్వాస నీవే
నా ప్రతి ధ్యాస నీవే
నీ కృప నా యెడల లేనిచో
క్షణమైన నేనుండలేనయ్యా
నీ హస్తం నాతోడు రానిచో
అడుగైనా నేవేయలేనయ్యా
నీ కృపను చూపావు అభయము నిచ్చావు
కనుపాపవలె కాపాడుచున్నావు
నీవు నన్ను ప్రేమించడానికి
ఏమంచి నాలోనలేదయా
నీవు నన్ను హెచ్చించడానికి
కారణమేమియు లేదయా
ఐనా ప్రేమించావు నన్ను హెచ్చించావు
విడువక నా యెడల కృపచూపుచున్నావు