unnathudaa athyunnathudaa ఉన్నతుడా అత్యున్నతుడా
ఉన్నతుడా అత్యున్నతుడా
నీ ప్రేమ ఎంతో మహోన్నతమయా
పరిశుద్ధులలో మహానీయుడా
పదివేలలో అతి సుందరు
ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే
ఆదియు అంతము నీవని
నీవు గాక మరి ఎవ్వరు లేరని
నా తుది శ్వాస వరకు – నీ సేవయే నే చేయాలని
నీ పాద సేవలోనే నిత్యము ఉండాలని
ప్రేమకు ప్రతిరూపం నీవని నీ ప్రేమకు సాటి లేదని
నీ ప్రేమవార్తను ఇలలో – అలయకనే ప్రకటించాలని
నీ ప్రేమలోనే నిత్యం జీవించాలని