ee reyi challanidi ఈ రేయి చల్లనిది
ఈ రేయి చల్లనిది
ఇహ పరాల పెన్నిధి
రమ్యమాయె రాతిరి
రాజు యేసు రాకచే
ఆది ఆదాము దోషము
అఖిల జగతి దాస్యము
అంతరించగ దైవము
అవతరించిన సుదినము
మానవాళి పాపము
మానిపోని తాపము
తొలగె తండ్రి కోపము
కలిగె రక్షణ భాగ్యము
ఇహము పరము కలిసెను
ఇలలో స్వర్గము వెలిసెను
అంధకార అవనిలో
అమర జ్యోతి వెలిగెను