aanandhageethamu ne padedha christmas subhavelalo ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో
ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో
సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో
దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను
ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను
మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను
దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి
బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి
జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను
కన్యక గర్భాన ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను