aanandamtho sandadi cheddam ఆనందంతో సందడి చేద్దాం
ఆనందంతో సందడి చేద్దాం
సంతోషంతో చిందులు వేద్దాం
వచ్చిండు వచ్చిండు
ప్రియమైన నా యేసు
తెచ్చిండు తెచ్చిండు
లోకానికి రక్షణ తెచ్చిండు
పాపులకు రక్షణ కలిగింది
పాపానికి విరుగుడు తెచ్చింది
యేసయ్య నీ జన్మతో
మా జన్మ ధన్యమైయింది
నశియించిపోతున్న ఆత్మలకు
విడుదల కలిగింది
లోకమంతా వెలుగుతో మెరిసింది
మానవాళికి మోక్షం కలిగింది
యేసయ్య నీ జన్మతో
జగమంత సంతోషించింది
చీకటి నుండి వెలుగులోనికి
మనలను తెచ్చింది