adavi pushpama santhoshinchuma kasturi pushpama ullasinchuma అడవి పుష్పమా సంతోషించుమా కస్తురీ పుష్పమా ఉల్లసించుమా
అడవి పుష్పమా సంతోషించుమా – కస్తురీ పుష్పమా ఉల్లసించుమా
ఎండిన భూమి అరణ్యమా – సంగీతములు పాడుమా (2) || అడవి పుష్పమా ||
1. లెబనోను సౌందర్యమూ – నీకు కలుగునుగా
షారోను పరిమళమూ – నీకు ఉండునుగా
కర్మెలు సొగసు దేవుని తేజస్సు నీకు ఇచ్చునుగా (2) || అడవి పుష్పమా ||
2. సడలిన చేతులను – బలపరచిన దేవుడు
తొట్రిల్లు మోకాళ్ళను – ద్రుడపరచిన నాథుడు
భయము నొందకు నీ దేవుడు శక్తివంతుడు (2) || అడవి పుష్పమా ||