andhaala chinni gootilona puttina pichukanu అందాల చిన్ని గూటిలోన పుట్టిన పిచ్చుకను
అందాల చిన్ని గూటిలోన – పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను – నింగిలో ఎగిరాను
ఈ చిన్ని జీవికి రూపం ప్రాణం – అన్నీ ఇచ్చింది యేసే
ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ – జత కలిపి పాడమ్మ
లేచే ప్రతి ఉదయం – పాడే నా ప్రాణం
పదిలముగా కాచే – ప్రభువే నా లోకం
విత్తలేదు నేను కోయలేదు – కొట్లలో కూర్చుకోలేదు
కొరతంటూ నాకు తెలియదు – కలతంటూ నాకు లేనేలేదు
పరలోక తండ్రి నా కొరకు అన్నీ – సమకూర్చుచున్నాడులే
పిచ్చుక విలువ కాసే ఐనా – రాలునా తండ్రి కాదన్నా
తన రూపునే మీకు ఇచ్చుకున్న – తన కన్నా యెవరన్నా ప్రేమించునా?
శ్రేష్టులైన మీరు భయపడ తగునా – మీ తండ్రి తోడుండగా