paapamu valanao chedinavaaniao praemathoaపాపము వలనఁ చెడినవానిఁ ప్రేమతో
1. పాపము వలనఁ చెడినవానిఁ
ప్రేమతో వెతకి రక్షించుఁడు
తప్పినవానిని ద్రోహిని మీరు
యేసుని యొద్దకు రమ్మనుఁడు.
||పడినవారికిఁ జూపుఁడు త్రోవ
యేసు పాపాత్ములన్ రక్షిం
చును||
2. నీతిని కోరక యల్లాడువాని
యేసు రక్షించుటకై కాచును
ప్రేమతో వారినిఁ బిలుచుకొండి
యేసును నమ్మిన రక్షించును.
3. పాపవిషంబు మనస్సున దాగి
గుణము పూర్తిగఁ జెఱిపినన్
యేసుని ప్రేమ యనుకిరణంబు
దాని గుదుర్చును పూర్ణముగా.
4. చెడినవారిని రక్షింపఁ బొండి
యేసుఁడు శక్తిని మీ కీయఁగా
మోక్ష మార్గంబునడిపించుండి
వారిని రక్షింప యేసు వచ్చెన్
1. paapamu valanAO chedinavaaniAO
praemathoa vethaki rakShiMchuAOdu
thappinavaanini dhroahini meeru
yaesuni yodhdhaku rammanuAOdu.
||padinavaarikiAO joopuAOdu throava
yaesu paapaathmulan rakShiM
chunu||
2. neethini koaraka yallaaduvaani
yaesu rakShiMchutakai kaachunu
praemathoa vaariniAO biluchukoMdi
yaesunu nammina rakShiMchunu.
3. paapaviShMbu manassuna dhaagi
guNamu poorthigAO jeRipinan
yaesuni praema yanukiraNMbu
dhaani gudhurchunu poorNamugaa.
4. chedinavaarini rakShiMpAO boMdi
yaesuAOdu shakthini mee keeyAOgaa
moakSh maargMbunadipiMchuMdi
vaarini rakShiMpa yaesu vachchen