bhaaramainadhi saeva maranamu భారమైనది సేవ మరణము కన్న భారమైన
భారమైనది సేవ మరణము కన్న భారమైనది సేవ ఘోరనరకపు
దారి చేరి నడచెడివారిన్ జేరి వారితో సంప్రదించి ప్రభువును చూపి
ఘోరనరకపు బాధలన్నియు కూర్మితో వినజెప్పి మోక్షపు దారికిని
నడిపించి యేసుని దాపునకు నడిపించుదారి||
1. దురితదుర్గతి నశియించు వారినిజూచి పరితాప మొందవలయున్
మారమనసు నొంది చేరి ప్రభునితో కలిసి ఘోరపాపిని నేనని వేడి
సిలువ ధ్యానించి దురితములను చేయనని తీర్మానములను చేసికొని
రక్షింపబడినది గురుతుగ సాక్ష్యంబునిచ్చుటయే దారి||
2. ప్రథమ దశభాగంబుల ప్రభునకు నిచ్చి ప్రతిదినము ప్రార్థింప వలెన్
అధములగు బీదలకు నాధారముల నొసగి విధిగ భక్తుల నాదరించి
సవరించి ప్రభువు వాక్యము చదువుకొనుచు ప్రభుని పాటలు పాడుకొనుచు
ప్రభుని వేదము ప్రచురపరచి పదిలముగ జీవించకోరి||
3. దేశదేశముల తిరిగి దేవుని వాక్యము దేశప్రజలకు చాటవలెన్
ఆశాదురాశలను కోసివేసి యేసు దాసులను జేసి వెలిగించి తిలకించి
యేసుభక్తుల పదిలపరచి యేసుతో పరిచయము చేసి యేసును ధరియింప
జేసి యేసుతో నివసించుదారి ||
bhaaramainadhi saeva maraNamu kanna bhaaramainadhi saeva ghoaranarakapu
dhaari chaeri nadachedivaarin jaeri vaarithoa sMpradhiMchi prabhuvunu choopi
ghoaranarakapu baaDhalanniyu koormithoa vinajeppi moakShpu dhaarikini
nadipiMchi yaesuni dhaapunaku nadipiMchudhaari||
1. dhurithadhurgathi nashiyiMchu vaarinijoochi parithaapa moMdhavalayun
maaramanasu noMdhi chaeri prabhunithoa kalisi ghoarapaapini naenani vaedi
siluva DhyaaniMchi dhurithamulanu chaeyanani theermaanamulanu chaesikoni
rakShiMpabadinadhi guruthuga saakShyMbunichchutayae dhaari||
2. praThama dhashabhaagMbula prabhunaku nichchi prathidhinamu praarThiMpa valen
aDhamulagu beedhalaku naaDhaaramula nosagi viDhiga bhakthula naadhariMchi
savariMchi prabhuvu vaakyamu chadhuvukonuchu prabhuni paatalu paadukonuchu
prabhuni vaedhamu prachuraparachi padhilamuga jeeviMchakoari||
3. dhaeshadhaeshamula thirigi dhaevuni vaakyamu dhaeshaprajalaku chaatavalen
aashaadhuraashalanu koasivaesi yaesu dhaasulanu jaesi veligiMchi thilakiMchi
yaesubhakthula padhilaparachi yaesuthoa parichayamu chaesi yaesunu DhariyiMpa
jaesi yaesuthoa nivasiMchudhaari ||