chaalunu loaka bhoagamulu chaaచాలును లోక భోగములు చాలును చాలు
చాలును లోక భోగములు చాలును చాలును మీనమును బట్టు
గాలమైయున్న భోగములు ||చాలును||
1. ఎండమావులే నీరనుచు మెండుగఁ బరుగిడు జింక కుప మండనై
బలహీను నైతిఁ ||చాలును||
2. బూరుగ పండారగింపఁ గోరి కాచికొని యున్నట్టి కీరసామ్య మైతి
నయ్యో ||చాలును||
3. దీపపు దీప్తి నాశించి యూపిరి విడు పురుగు రీతిఁ బాపపు భ్రమచే
నట్లయితిఁ ||చాలును||
4. పూలతో ఁటయందుఁ బెరుగు బూరుగ వృక్షంబునై నే మేలునకు
మూలముగాన నైతిఁ ||చాలును||
5. చల్లిన వితనము ల్జంపు చౌట భూమి వలె నేఁ గాఁగ సత్యము
నిష్ఫలమయ్యొ నకట ||చాలును||
6. మాయ సంత నైతి యేసు నాయక నన్విడక మార్పు జేయుమి నెన
రుంచి నాపైఁ ||చాలును||
7. తొల్లి నన్ రప్పించినట్టి చల్లని సువార్త తేజ ముల్లమందు నుండఁ జేయ
||చాలును||
8. మంచు పోల్కె ననుఁ జేయుటకై ముంచుమీ నీ రక్తాంబుధిలోఁ బెంచుమి
నీ వాక్సారము చేఁ ||చాలును||
9. చెడ్డ బిడ్డ నయ్య నేను దొడ్డ రక్షకుండ వీవు అడ్డులేక నన్నుఁ
బ్రోవు ||చాలును||
chaalunu loaka bhoagamulu chaalunu chaalunu meenamunu battu
gaalamaiyunna bhoagamulu ||chaalunu||
1. eMdamaavulae neeranuchu meMdugAO barugidu jiMka kupa mMdanai
balaheenu naithiAO ||chaalunu||
2. booruga pMdaaragiMpAO goari kaachikoni yunnatti keerasaamya maithi
nayyoa ||chaalunu||
3. dheepapu dheepthi naashiMchi yoopiri vidu purugu reethiAO baapapu bhramachae
natlayithiAO ||chaalunu||
4. poolathoa AOtayMdhuAO berugu booruga vrukShMbunai nae maelunaku
moolamugaana naithiAO ||chaalunu||
5. challina vithanamu ljMpu chauta bhoomi vale naeAO gaaAOga sathyamu
niShphlamayyo nakata ||chaalunu||
6. maaya sMtha naithi yaesu naayaka nanvidaka maarpu jaeyumi nena
ruMchi naapaiAO ||chaalunu||
7. tholli nan rappiMchinatti challani suvaartha thaeja mullamMdhu nuMdAO jaeya
||chaalunu||
8. mMchu poalke nanuAO jaeyutakai muMchumee nee rakthaaMbuDhiloaAO beMchumi
nee vaaksaaramu chaeAO ||chaalunu||
9. chedda bidda nayya naenu dhodda rakShkuMda veevu addulaeka nannuAO
broavu ||chaalunu||