• waytochurch.com logo
Song # 2838

paramaedhaesha midhigoa noothaపరమేదేశ మిదిగో నూతన యెరూస లేమద


Chords: ragam: బంగాలాఝురి-bMgaalaajhuri

పరమేదేశ మిదిగో నూతన యెరూస లేమదిగో సోదర తిర మగు
పురమది దివ్య సుందరము తరముగాదు త ద్దయు వర్ణింపగ ||బరమ||

1. ద్వాదశ రత్నములా ప్రోలుపు నాదులుగా నుండు సోదర యాదట
దీరక నాణి ముత్తియ వి నోదద్వారముల నమరి వెలయు ||బరమ||


2. శుద్ధ సువర్ణమున నెంతో శుద్ధి మార్గముండు సోదర శుద్ధు లెల్ల
బరి శుద్ధ గానముల శుద్ధుని నెప్పుడు స్తుతి యొనరింతురు ||బరమ||


3. పరమ జనకు సముఖం బచ్చట నరులతోడ నుండన్ సోదర
నరులు దేవుని నరులై యుందురు పరమాత్ముడు దన వారలతో నుండును
||బరమ||


4. కన్నీరుండదుగా దేవుఁడు గన్నుల దుడుచునుగా సోదర యెన్నఁగ
మరణం బిక నుండదు మరి చెన్నుగ భేదము శీఘ్రము దొలఁగును
||బరమ||


5. పరమపురమునందు దేవుని కిరవొకటుండదుగా సోదర పరమ
జనకుడును గొఱ్ఱె పిల్లయును మురువుగ నొక మందిరమై యుందురు
||పరమ||


6. రవి చంద్రులతోడన్ నిజముగ నవసరముండదుగా సోదర
యవిరతముగ యే సువె ఘనతరవై భవమై ప్రభతో బరగుచు నుండును
||పరమ||


7. సంతతంబిచ్చోట సాధులు స్తుతి సేతురు దేవున్ సోదర
యతులితంబుగా హర్షమకుటమును సతతము దాల్తురు స్వామి సన్నిధిని
||పరమ||


8. ఆఁకలియుండదుగా నిజముగా నాకుల ముండదుగా సోదర
ప్రాకటముగ జీ వ జలంబచ్చట నీకు నొసంగును నిరతము వరదుఁడు
||పరమ||


9. ప్రభు సన్నిధినుండి పారును శుభనది సుఖ మియ్యన్ సోదర
యుభయ తీరముల నుండు తరులు సౌ రభ దీప్తిని శుభ రక్షణ
ఫలమిడు ||పరమ||

paramaedhaesha midhigoa noothana yeroosa laemadhigoa soadhara thira magu
puramadhi dhivya suMdharamu tharamugaadhu tha dhdhayu varNiMpaga ||barama||

1. dhvaadhasha rathnamulaa proalupu naadhulugaa nuMdu soadhara yaadhata
dheeraka naaNi muththiya vi noadhadhvaaramula namari velayu ||barama||


2. shudhDha suvarNamuna neMthoa shudhDhi maargamuMdu soadhara shudhDhu lella
bari shudhDha gaanamula shudhDhuni neppudu sthuthi yonariMthuru ||barama||


3. parama janaku samukhM bachchata narulathoada nuMdan soadhara
narulu dhaevuni narulai yuMdhuru paramaathmudu dhana vaaralathoa nuMdunu
||barama||


4. kanneeruMdadhugaa dhaevuAOdu gannula dhuduchunugaa soadhara yennAOga
maraNM bika nuMdadhu mari chennuga bhaedhamu sheeghramu dholAOgunu
||barama||


5. paramapuramunMdhu dhaevuni kiravokatuMdadhugaa soadhara parama
janakudunu goRRe pillayunu muruvuga noka mMdhiramai yuMdhuru
||parama||


6. ravi chMdhrulathoadan nijamuga navasaramuMdadhugaa soadhara
yavirathamuga yae suve ghanatharavai bhavamai prabhathoa baraguchu nuMdunu
||parama||


7. sMthathMbichchoata saaDhulu sthuthi saethuru dhaevun soadhara
yathulithMbugaa harShmakutamunu sathathamu dhaalthuru svaami sanniDhini
||parama||


8. aaAOkaliyuMdadhugaa nijamugaa naakula muMdadhugaa soadhara
praakatamuga jee va jalMbachchata neeku nosMgunu nirathamu varadhuAOdu
||parama||


9. prabhu sanniDhinuMdi paarunu shubhanadhi sukha miyyan soadhara
yubhaya theeramula nuMdu tharulu sau rabha dheepthini shubha rakShNa
phlamidu ||parama||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com