yaesukreesthuni dhaasulaaraa mయేసుక్రీస్తుని దాసులారా మీ సుత
యేసుక్రీస్తుని దాసులారా మీ సుతులకును నేర్పరె ఆశతో యెహోవ
యాజ్ఞల నభ్యసింపగ జేయరే ||యేసు||
1. పిల్లలెప్పుడు ననుసరింతురు తల్లిదండ్రుల నడతలన్ ఎల్ల విషయము
లందు మాదిరి పిల్లలకు గనుపర్చరే ||యేసు||
2. మోదమిచ్చు కుటుంబ ప్రార్థన నేదినంబును మానక ఆదివారపు బడికి
బిడ్డల నాదరముతో బంపరే ||యేసు||
3. యేసునాధుని బోలు నాయకు డే జగంబున లేడని యేసు కే నిజ
శిష్యులగుటకు నేర్పరే యౌవనులకు ||యేసు||
4. యేసు శౌశీల్యమును వారికి బోధింపరే పసితనమునె వారి
హృదయము యేసురూపము దాల్చును ||యేసు||
5. యేసుక్రీస్తులొ నిలిచి వారలు యేపుమీర ఫలింపగా యేసు వాక్యము
వారి యెదలలో నాశతోడను నాటరే ||యేసు||
yaesukreesthuni dhaasulaaraa mee suthulakunu naerpare aashathoa yehoava
yaajnYla nabhyasiMpaga jaeyarae ||yaesu||
1. pillaleppudu nanusariMthuru thallidhMdrula nadathalan ella viShyamu
lMdhu maadhiri pillalaku ganuparcharae ||yaesu||
2. moadhamichchu kutuMba praarThana naedhinMbunu maanaka aadhivaarapu badiki
biddala naadharamuthoa bMparae ||yaesu||
3. yaesunaaDhuni boalu naayaku dae jagMbuna laedani yaesu kae nija
shiShyulagutaku naerparae yauvanulaku ||yaesu||
4. yaesu shausheelyamunu vaariki boaDhiMparae pasithanamune vaari
hrudhayamu yaesuroopamu dhaalchunu ||yaesu||
5. yaesukreesthulo nilichi vaaralu yaepumeera phliMpagaa yaesu vaakyamu
vaari yedhalaloa naashathoadanu naatarae ||yaesu||