emthoa ramymbainadhi bhoothalaఎంతో రమ్యంబైనది భూతలమందు ఎంతో
ఎంతో రమ్యంబైనది భూతలమందు ఎంతో మాన్యంబైనది చెంత జేరి
యేసు వింత పాదాబ్జముల సంతసంబున పూజసల్పు క్రైస్తవ గృహము ||ఎంతో||
1. పిల్ల లొలీవ మొక్కలై బల్లల చుట్టు ఎల్లప్పుడు ఆడుచున్ నుల్లమందున
యేసు చల్లని వాక్యంబున్ నెల్ల వేళల దలచి నుండుచుండెడి గృహము ||ఎంతో||
2. తల్లిదండ్రు లైక్యత దనరుచునుండి దాక్షిణ్య నిధుల జిల్కి ఎల్లప్రేమామృత
మెల్ల వారల కొసగి కల్లోలములు వీడి నుల్లసిల్లెడి గృహము ||ఎంతో||
3. పొరుగువారల మైత్రిని పొందుగ గోరి పొలుపారు నీతిన్ దనరు
నురుతరనాత్మ వరముల పైని గురిపించు వరదాత యేసున్ ప్రార్థించు
క్రైస్తవ గృహము ||ఎంతో||
4. శోధనల నన్నింటిని సర్వదా పైచి శోభిల్లు విశ్వాసమున్ మోద మొందగ
యేసునాధు నందున నిల్పి సాదరంబుగ సాక్ష్యమిడెడు క్రైస్తవ గృహము ||ఎంతో||
5. వ్యర్థ ఖర్చుల మానుచు వర్ధిల్లు కొలది సర్దుకొని జీవించుచున్ వృద్ధి
నొందెడు వేళ శ్రద్ధాభక్తులతో డా ఇద్ధరిత్రిని దశమభాగ మొసగెడు గృహము ||ఎంతో||
eMthoa ramyMbainadhi bhoothalamMdhu eMthoa maanyMbainadhi cheMtha jaeri
yaesu viMtha paadhaabjamula sMthasMbuna poojasalpu kraisthava gruhamu ||eMthoa||
1. pilla loleeva mokkalai ballala chuttu ellappudu aaduchun nullamMdhuna
yaesu challani vaakyMbun nella vaeLala dhalachi nuMduchuMdedi gruhamu ||eMthoa||
2. thallidhMdru laikyatha dhanaruchunuMdi dhaakShiNya niDhula jilki ellapraemaamrutha
mella vaarala kosagi kalloalamulu veedi nullasilledi gruhamu ||eMthoa||
3. poruguvaarala maithrini poMdhuga goari polupaaru neethin dhanaru
nurutharanaathma varamula paini guripiMchu varadhaatha yaesun praarThiMchu
kraisthava gruhamu ||eMthoa||
4. shoaDhanala nanniMtini sarvadhaa paichi shoabhillu vishvaasamun moadha moMdhaga
yaesunaaDhu nMdhuna nilpi saadharMbuga saakShyamidedu kraisthava gruhamu ||eMthoa||
5. vyarTha kharchula maanuchu varDhillu koladhi sardhukoni jeeviMchuchun vrudhDhi
noMdhedu vaeLa shradhDhaabhakthulathoa daa idhDharithrini dhashamabhaaga mosagedu gruhamu ||eMthoa||