santhoshamey na yesunilo …సంతోషమే నా యేసునిలో
సంతోషమే నా యేసునిలో
నిత్యానందమునిచ్చు నాధునిలో
మనసంతా సంతోషం (హే …….)
మనసంతా సంతోషం ఆథ్మలో ఆనందం
యేసయ్య .. అది దొరికెను నీలో
శ్రమలలో నీ మాట కలిగించే ఆనందమే
దుఃఖములో నీ ప్రేమా పుట్టించె ధైర్యమునే
వ్యాధైనా భాదయినా నను వీడిపోడు
కనుపాపై నాతోనే నిత్యం వుంటాడు
వ్యాధైనా మరి భాదయినా నను వీడిపోడు
కనుపాపై నాతోనే నిత్యం వుంటాడు
నను ప్రేమించే నా దేవుడు
నను రక్షించే నా నాధుడు
యెమున్నా లేకున్నా నీవున్న చాలంతే
ఇచ్చువాడవు నీవే పోషించువాడవు నీవే
నా ప్రాణం సర్వస్వం నీవేగా యేసయ్య
నీ ప్రేమే నాతోనే వుంటే చాలయ్య
బ్రతుకంతా నీలోనే యేసయ్య .. ఆఆ ..
చావైతే నీకొరకే యేసయ్య …