Bangaaramu veedhulunna nagaramulona బంగారము వీధులున్న నగరములోన
బంగారము వీధులున్న నగరములోన
కొలువు దీరిన రారాజు
జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి
మట్టి నేల చేరినాడు
పాపమూ శాపము లెన్నో
ఉన్న జనమును కోరుకున్నాడు
మనల చేర్చాలని తన
కొలువు లోనికి రాజ్యమునే విడిచాడు
తప్పుల అప్పుకు హద్దులు లేక
బ్రతుకు భారమవుతుంటే
తప్పులు మన్నించి బరువు
దించమని తననే వేడుకుంటే
క్షణ కాలమైన ఆలోచించక
తప్పులు మన్నించుతాడు
మన శిక్షనంత చెల్లించటానికి
పరము నుండి వచ్చినాడు
పాపము నిండిన హృదయములోన
నీతి నింప వచ్చినాడు
తనకెంత దూరము మనము వెళ్ళిన
ప్రేమనంత పంచుతాడు
పాపపు బానిస జనమును పిలిచి
స్నేహము అందించుతాడు
మన దోషమంత రద్దు చేయుటకు
రారాజు బంటు అయినాడు
bangaaramu veedhulunna nagaramulona
koluvu dheerina raaraaju
janulanu kaayagaa prematho dheenudigaa maari
matti nela cherinaadu
paapamu saapamulenno
unna janamunu korukunnaadu
manala cherchaalani thana
koluvuloniki raajyamune vidichaadu
thappula appuku haddhulu leka
brathuku bhaaramavuthunte
thappulu manninchi baruvu
dhinchamani thanane vedukunte
kshana kaalamaina aalochinchaka
thappulu manninchuthaadu
mana sikshanantha chellinchataaniki
paramu nundi vachinaadu
paapamu nindina hrudhayamulona
neethi nimpa vachinaadu
thanakentha dhooramu manamu vellina
premanantha panchuthaadu
paapamu baanisa janamunu pilichi
snehamu andhinchuthaadu
mana dhoshamantha raddhu cheyutaku
raaraaju bantu ayinaadu