• waytochurch.com logo
Song # 28638

vente vuntanantu nannu vembadinchina వెంటే ఉంటానంటు నను వెంబడించిన నా మంచి నజరేయుడా


వెంటే ఉంటానంటు నను వెంబడించిన నా మంచి నజరేయుడా
ఆపదలో "తండ్రీ " అని పిలవగానే, నాముందు నిలిచే నజరేయుడా ''2''
నజరేయుడా నను నడిపించే నాయకుడా
స్తుతి పాత్రుడా నా స్తోత్రార్పన నీకేనయ్యా ''2''

1. సాక్ష్యములెన్నునా సంభాషణలకే పరిమితమై నిజస్నేహితుడా
నిను మరుగున పెడితినేమో? ''2''
ఐనా, నను క్షమియించి చేరదీసినావే
నూతన సాక్ష్యముతో తిరిగి నిలబెట్టినావే. ''2''

2.నీ వెంటే నేనుండ నీ కోరిక ఐనా దేవా,
నా వెంటే నీవుండి నా కోరిక తీర్చావయ్యా ''2''
అందుకే, నా మంచి యేసయ్యా,
నిను శిరస్సుపై నిలబెట్టా స్వాగతమయ్యా ''2''


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com