prardhane manakunna shakthi ప్రార్థనే మనకున్న శక్తి
ప్రార్థనే మనకున్న శక్తి ప్రార్థన లేమి బలహీనత ప్రార్థన దేవునితో జరిపే సంభాషణ ప్రార్థనే మనకు కలిగించు దీవెన1. బాలలు సమూయేలువలె ప్రార్థించాలి యవనులు తిమొతివలె ప్రార్థించాలి వృద్ధులకు దేవాలయములో ప్రార్ధించిన అన్నాయే మాదిరి2. ఉదయాన దావీదువలె ప్రార్థించాలి మధ్యాహ్నాన దానియేలువలె ప్రార్థించాలిరాత్రివేళ చెరసాలలో ప్రార్థించిన పౌలు సీలలే మాదిరి3. అపాయంలో పేతురువలె ప్రార్థించాలి దుఃఖములో హన్నావలె ప్రార్థించాలి బహు శ్రమలో ప్రభుని విడువక ప్రార్థించిన యోబు కదా మాదిరి4. ఆరంభమున ఎలియాజరువలె ప్రార్థించాలి ముగింపులో సొలోమోనువలె ప్రార్థించాలి అన్నివేళలా అత్యాశక్తితో ప్రార్ధించిన ఆది సంఘమే మాదిరి