gathakalamu ni krupalo గతకాలము నీ కృపలో నను రక్షించి
గతకాలము నీ కృపలో నను రక్షించిదినదినమున నీ దయలో నను బ్రతికించినీ కనికరమే నాపై చూపించినీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా!నా స్థితిగతులే ముందే నీవెరిగిఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! "2"నా దేవా..నీకే వందనంనా ప్రభువా..నీకే స్తోత్రము..నా దేవా..నీకే వందనంనా ప్రభువా..నీకే స్తోత్రము..నా ప్రభువా..నీకే స్తోత్రము..కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగకదినమంతా వేదనలో నేనుండగా..నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక గతమంతా శోధనలో పడియుండగా..ఏ భయము నను అవరించక..ఏ దిగులు నను క్రుంగదీయకనాతోడునీడవై నిలిచావునా చేయి పట్టి నడిపించావుకాలాలు మారగా..బంధాలు వీడగాలోకాన ఒంటరినై నేనుండగా నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములోజీవితమే భారముతో బ్రతికుండగాఅరచేతిలో నన్ను దాచిన కనుపాపల నన్ను కాచిననీ చెలిమితోనే నను పిలిచావు నా చెంత చేరి ప్రేమించావు..ఊహించలేదుగా ఈ స్థితిని పొందగానా మనసు పరవశమై స్తుతి పాడగాఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగానా స్వరము నీ వరమై కొనియాడగా నీవిచ్చినదే ఈ జీవితంనీ కోసమే ఇది అంకితంనీ ఆత్మతోనే నను నింపుమయా..నీ సేవలోనే బ్రతికించుమయా