Jagamantha Sambarame 2 జగమంతా సంబరమే 2
జగమంతా సంబరమే చీకటి కమ్మెనే ఈ లోకంలో ఆజ్ఞను మీరగా ఏదేనులోరక్షకుడొచ్చెనే మన రూపంలో విడుదలనిచ్చెనే తన రక్తంలో ఈ లోకమునే వెలిగింపనూ......ఆ మహిమనే వీడెనూ......జగమంతా సంబరమే మొదలాయెనేజయధ్వనులే చేయాలి మన యేసుకే "2"1. నిరీక్షించే కన్నుల ఎదురుచూపు ఇతడే నిత్యజీవమిచ్చే మోక్షమార్గం ఇతడే "2" జనియించే రాజుగా భువినే పాలించ రా భారములే బాప రా వచ్చెను మెస్సయ్యగా "ఈ లోకమునే"2. పాతవన్ని పోయెను క్రొత్తవిగా మారెను నిత్య నిబంధననే మనకు ఇచ్చెను "2" మార్చెను కన్నీటినీ మహిమలో నాట్యముగా నమ్మిన ప్రతివారినీ మార్చెను తన స్వాస్థ్యముగా "ఈ లోకమునే"