Daiva Maata Maa Nota దైవ మాట మా నోట
దైవ మాట మా నోట దైవ మాట! మా నోట! పలుకుతాం, అది జీవపు ఊట!దైవ మాట! మా నోట! చెడును కాల్చేడి నిప్పుల ఊట!రాజాజ్ఞ ఈ మాట - అధికారం గల మాట - ఆయుధము నీ నోట!పెల్లగించేయ్ - ప్రభువు నాటని మొక్కనువిరుగగొట్టేయ్ - సాతాను కాడినినశింపజేసేయ్ - అపవాది క్రియలనుపడద్రోసేయ్ - ఆ దుష్టుని ప్రతి దుర్గమునుకట్టరా యిక దేవుని రాజ్యమునాటరా ప్రతి హృదయంలో వాక్యము(నాటరా ఈ వాక్యంతో సంఘము)1. ప్రపంచములు ఈ మాట వలనే నిర్మాణములైనవి గదా!మహత్తుగల తన మాట చేత నిర్వహించుచున్నాడుగా! సృష్టిని పరిపాలించే దైవం ఈ మాట! సృష్టిని నడిపిస్తున్న శబ్దం ఈ మాట! ఈ మాట నువు పలికి ఏలేయ్ ప్రతిచోట!2. ప్రవక్తలంతా ఈ మాట పలికి రాజ్యాల్నే కదిలించెగా! తన సేవకుల మాటల్ని ప్రభువు తప్పక రూఢిపరచుగా!ఆత్మ చెప్పే మాట పలుకు నీ నోట!ఉరుమై గర్జించాలి సత్యం ప్రతిచోట!ఈ మాట నిష్ఫలము కాదు ఏ పూట!3. ప్రభువైన యేసు, తన మాట వలన దయ్యాలను వదిలించెగా!తన వాక్కు పంపి, ఏ వ్యాధినైనా క్షణమందు బాగుచేసెగా! గాలి తుఫాన్నైనా ఆపును ఈ మాట! ఎండిన ఎముకలనైనా లేపును ఈ మాట! ఈ మాటతో కూల్చేయ్ రా ఆ దుష్టుని కోట!4. ప్రతి రోజు నువ్వు శోధనలన్నిటిని గెలవొచ్చు ఈ వాక్కుతో!ఆత్మయుద్ధంలో దుష్టుని ఎదిరించి తరుమొచ్చు ఈ కత్తితో!దుష్టుని నేలకు కూల్చే ఖడ్గం ఈ మాట!చీకటి శక్తులపైన విజయం ఈ మాట!ఈ మాట అపవాది గుండెల్లో తూట!5. ప్రకటించేయ్ వాక్యం, బందీలందరికి, స్వాతంత్ర్యమునిచ్చే సత్యం!హృదయపు లోతులను, సరిచేసే శస్త్రం, ఇది రెండంచుల గల ఖడ్గం!బండను బద్దలు చేసే సుత్తె ఈ మాట!చెత్తను దగ్ధం చేసే అగ్ని ఈ మాట!ఈ మాట దీపంలా చూపించును బాట!6. ప్రవచనమగు వాక్యం నువు పలుకుతూ ఉంటే అద్భుతాల్ని చూస్తావుగా!వాక్యం నెరవేర్చే బలశూరులైన దూతల్ని పొందొచ్చుగా!వాక్యం నీకు వస్తే దైవం నువ్వంట!వాక్యం నీలో ఉంటే (నువ్వు తింటే) బలవంతుడవంట!ఈ మాట మండించును హృదయాల్లో మంట!