Naa Devudu Goppavadu నా దేవుడు గొప్పవాడు ఏదైనా చెయ్యగలడు
నా దేవుడు గొప్పవాడు - ఏదైనా చెయ్యగలడు ప్రభువెపుడు ఓడిపోడు – ఓడి పోడు, ఓడిపోడుసరియైన సమయమందే - రంగంలో దూకుతాడుముందు రాడు - ఆలస్యమవ్వడు - ముందు రాడు, ఆలస్యమవ్వడు భవిష్యత్ ఏమౌతుందోనన్న భయము లేదు నాకు! రేపు ఏ మలుపు ఉందోనన్న చింత లేదు నాకు! అరె! నా జీవితం - ప్రభుని చేతిలో - (2) ఉంచి నేను నిశ్చింతగా ఉన్నా !1. నేనేమి అవ్వవలెనో - ఖచ్చితంగా తెలిసినోడు - ముందే నిర్ణయించినాడు!నన్నేమి చెయ్యవలెనో - ప్రభు చేసి తీరుతాడు - ఆపేటివాడు ఎవడు? నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపేనను గూర్చి తనదు గ్రంధములో వ్రాసి ఉంచినాడు.2. నా పాపంకొరకు ప్రభువు-జగతికి ఉత్పత్తి మొదలు-వధియింపబడియున్నాడుఏదైనా సమస్య నాపై - దండెత్తి రాక మునుపే - పరిష్కారం సిద్ధపరుస్తాడు.నా మేలు కొరకు అన్నియును సమకూర్చి జరుపు ప్రభువునా పక్షమందు కార్యమును సఫలపరచుతాడు. God knows the end from the beginning 3. నాకేమి అవసరములో - నేనింకా అడగనపుడే - నా తండ్రికి ముందే తెలుసు.నాకింక ఏమి కొదువ? - క్రీస్తేసు మహిమ వలన - సర్వ సమృద్ధి కలదు. తన సొంత కొడుకునే నా కొరకు యిచ్చేసినాడు తండ్రి ఆయనతో పాటు అన్నియును యిచ్చి తీరుతాడు4. మన దేవుని వాగ్దానములు- అన్నియును క్రీస్తునందు- అవును ఆమేన్ నాకు!వాగ్దానం చేసినోడు - ఎప్పుడూ నమ్మదగినవాడు - నాకసలు దిగులు లేదు. ఈ భూమి కంటె ఆకాశములు ఎంతెత్తుగా ఉన్నాయో నా కొరకు ప్రభుని ఉద్దేశ్యములు - అంత ఉన్నతములు! I’m safe in the hands of my Father (Jesus Christ) (Holy Spirit)5. తొట్రిల్లకుండ నన్ను - కాపాడగలిగినోడు - శక్తి గల రక్షకుండు. తన మహిమ యెదుట నన్ను - నిర్దోషిగా నిలువబెట్టి - ఆనందిస్తున్నవాడు. తన ఆత్మ చేత ముద్రించెను నను, నా ప్రభువు వచ్చువరకు నను తండ్రి చేతిలోనుండెవడు అపహరింపలేడు!