• waytochurch.com logo
Song # 28673

Varamulato nee vasamai వరములతో నీ వశమై


వరములతో నీ వశమై


నిత్యము స్తుతులను పాడెదనూ యేసయ్యా
స్తోత్రమని నిను పొగడెదనూ యేసయ్యా
ఘనుడవని ఆరాధించెదను
ప్రముఖుడవని సేవించెదను
వరములతో నీ వశమై - మనసారా కొలిచెదను
ఫలములతో మైమరచి - హృదయముతో పూజించెదను
నిత్యము స్తుతులను పాడెదనూ యేసయ్యా
స్తోత్రమని నిను పొగడెదనూ యేసయ్యా
|| వరములతో ||

1.రకరకాల వలయాలెన్నో ఆవరించగా
నీ ముందర నిలిచే ధైర్యం క్షీణించిపోయెను
ప్రమాదపు అంచున నిలిచినానని వెనుకకు పిలిచావు
నాకై దాచిన నీ సంకల్పం స్థిరమని తెలిపావు
|| వరములతో ||

2.నా దృష్టికి అందని జ్ఞానము అజ్ఞానిని చేయగా
పలు శోధన మార్గములెన్నో బలహీనుని చేసెను
అయినను ఓ మంచి పాత్రగా నీతో నడిపావు
కృపను వెంబడి కృపను పంపి సంపూర్ణుని చేశావు
|| వరములతో ||

3.ప్రతి అక్కరలో మనుష్యులను ఆశ్రయించగా
నీ బలమంతటిని బహుగా చులకన చేసాను
కోపము చూపక మరోమారు నీ ఋణమును పెంచావు
విలువలేని ఈ అధమునిపై నీ ప్రేమను చాటావు
|| నిత్యము ||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com