Varamulato nee vasamai వరములతో నీ వశమై
వరములతో నీ వశమై నిత్యము స్తుతులను పాడెదనూ యేసయ్యా స్తోత్రమని నిను పొగడెదనూ యేసయ్యా ఘనుడవని ఆరాధించెదను ప్రముఖుడవని సేవించెదను వరములతో నీ వశమై - మనసారా కొలిచెదనుఫలములతో మైమరచి - హృదయముతో పూజించెదను నిత్యము స్తుతులను పాడెదనూ యేసయ్యాస్తోత్రమని నిను పొగడెదనూ యేసయ్యా || వరములతో ||1.రకరకాల వలయాలెన్నో ఆవరించగా నీ ముందర నిలిచే ధైర్యం క్షీణించిపోయెను ప్రమాదపు అంచున నిలిచినానని వెనుకకు పిలిచావు నాకై దాచిన నీ సంకల్పం స్థిరమని తెలిపావు || వరములతో ||2.నా దృష్టికి అందని జ్ఞానము అజ్ఞానిని చేయగా పలు శోధన మార్గములెన్నో బలహీనుని చేసెను అయినను ఓ మంచి పాత్రగా నీతో నడిపావు కృపను వెంబడి కృపను పంపి సంపూర్ణుని చేశావు || వరములతో ||3.ప్రతి అక్కరలో మనుష్యులను ఆశ్రయించగా నీ బలమంతటిని బహుగా చులకన చేసాను కోపము చూపక మరోమారు నీ ఋణమును పెంచావువిలువలేని ఈ అధమునిపై నీ ప్రేమను చాటావు || నిత్యము ||