ateethamaina anuragamu అతీతమైన అనురాగము
అతీతమైన అనురాగము యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు - 2విలువైనది నీ బంధము అతీత మైనది నీ అనురాగము నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2చెప్పలేని బాధలలో - మదనపడే వేళలో మమతనే పంచావు చింతలెన్ని చుట్టుముట్టున - చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు - 2చీకటి క్షణాలలో చిరు వెలుగువై నా వెంట నీవు వున్నావు నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2హృదయమంత వేదనతో - కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయూతనే అందించావు - 2అలసిన ప్రతి క్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2నా అన్నవారే నిందలు మోపగా స్నేహితులే కీడే చేయగా మేలులెన్నో పొందినవారే అవమానించగా న్యాయాధిపతివై ఘనత నీచ్చావు - 2ఎనలేని నన్ను నీవు గొప్పచేయ మొదలు పెట్టావయ్యా నే ఓడిన చోటనే నా పక్ష్యమై పితరుల అభిషేకం ఇచ్చావయ్యా నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2