కనుపాప వలే నను కాయుటకే
KANNUPAPAVALLE nanu kaayutaku
కనుపాప వలే నను కాయుటకేకునుకవు నీవు నా కన్న తండ్రీ శూరులే కూలే శోధన కాలమున కాపాడెదవూ నా యేసయ్యా 1.నీ తల వెంట్రుకలు లెక్కించితినీ నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ నిను తాకుట నా కను పొడుచుటయే భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే ॥కనుపాప॥2.జల ప్రళయములో పెను తుఫానులలో ఒంటరి సమయంలో మించిన పోరులలో నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తినికాపాడిన రీతి నను కావుమయ్యా ॥కనుపాప॥3. దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో అగ్ని కీలలలో సింహపు కోరలలోనీ పిల్లలగు మా పితరులనూ కాపాడిన రీతి మము కావుమయ్యా ॥కనుపాప॥