Nee Krupatisayamu నీ కృపాతిశయమును అనునిత్యము
నీ కృపాతిశయమును అనునిత్యము పల్లవి:- నీ కృపాతిశయమును అనునిత్యమునే కీర్తించెదా తరతరములకునీ విశ్వాస్యతను నే ప్రచురింతునుఆ.పల్లవి:- నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనది మౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకానా తుది శ్వాస వరకు నీ చెంత చేరేవరకు 1. ఇంకా బ్రతికి ఉన్నామంటే - కేవలము నీ కృపాఇంకా సేవలో ఉన్నామంటే - కేవలము నీ కృపాఏ మంచితనము - లేకున్ననూ కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకొన్నది నీ కృపా ||నీ కృపా||2. పది తరములుగా వెంటాడిన - మోయాబు శాపమునీ కృపను శరణు వేడగా - మార్చేనే వెయ్యి తరములు అన్యురాలైన ఆ రూతును - ధన్యురాలుగా మార్చినదినీ కృపయే నన్ను దీవించగాఏ శాపము నాపై పనిచేయదు ||నీ కృపా||3. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే - కేవలము నీ కృపామెతుకు బ్రతుకు ఉన్నాయంటే - కేవలము నీ కృపాకృపతోనే రక్షణనిచ్చావు - నా క్రియల వలన కానే కాదుజీవితమంతా ఋణస్థుడనునీయందే నిత్యము అతిశయము ||నీ కృపా||4. ఇల్లు వాహనం ఉన్నాయంటే - నీదు కృపాదానమేబలము ధనము ఉన్నాయంటే - నీదు కృపా దానమే ఏ అర్హత నాలో లేకున్ననూ - కృపా భిక్షయే నా యెడలజీవితమంతా కృతజ్ఞుడనుజీవితమంతా పాడెదను ||నీ కృపా||5. ప్రియులే నన్ను విడనాడినా - శోకమే నా లోకమాఅనాధగానే మిగిలానే - నా కథ ముగిసినదేనీ కుడిచేతిలో ఉంచగనే - బెన్యామీను వంతుగా మారేఐదంతలాయే నా భాగ్యమువిధిరాతనే మార్చెనే నీ కృపా ||నీ కృపా||