baala yaesuni joodarae karu naబాల యేసుని జూడరే కరు ణాల వాలని
బాల యేసుని జూడరే కరు ణాల వాలని బాడరే కాల పూర్ణత జూచి
దేవుడు కొమరుడై జన్మించెనే ||బాల||
1. దూతలారా రండి రండి బేతలేమున బుట్టిన నూతనాద్భుత శిశువు
జూచి స్తోత్రగీతముల్ పాడరే ||బాల||
2. గొల్లలారా రండి రండి గొప్ప యుత్సవ మొందరే ఎల్ల జనులకు
రక్షణంబని యంతటను చాటించరే ||బాల||
3. జ్ఞానులారా రండి రండి కానుకల నర్పించరె దీనులను రక్షించ దేవుడు
మానవుండై బుట్టెను ||బాల||
4. భక్తులారా రండి రండి భజన పాటలు పాడరే ముక్తిరాజగు యేసు
ప్రభు మన మధ్యనే జన్మించెను ||బాల||
5. లోకుందరు రండి రండి ఏకమై కీర్తించరే శ్రీకరుండౌ యేసు క్రీస్తుడు
శ్రీ లొసంగగ వచ్చెను ||బాల||
baala yaesuni joodarae karu Naala vaalani baadarae kaala poorNatha joochi
dhaevudu komarudai janmiMchenae ||baala||
1. dhoothalaaraa rMdi rMdi baethalaemuna buttina noothanaadhbhutha shishuvu
joochi sthoathrageethamul paadarae ||baala||
2. gollalaaraa rMdi rMdi goppa yuthsava moMdharae ella janulaku
rakShNMbani yMthatanu chaatiMcharae ||baala||
3. jnYaanulaaraa rMdi rMdi kaanukala narpiMchare dheenulanu rakShiMcha dhaevudu
maanavuMdai buttenu ||baala||
4. bhakthulaaraa rMdi rMdi bhajana paatalu paadarae mukthiraajagu yaesu
prabhu mana maDhyanae janmiMchenu ||baala||
5. loakuMdharu rMdi rMdi aekamai keerthiMcharae shreekaruMdau yaesu kreesthudu
shree losMgaga vachchenu ||baala||