Nanu Belapaduthina Yesayya నన్ను బలపరచిన యేసయ్య
నన్ను బలపరచిన యేసయ్య నా తోడు
నన్ను స్థిరపరచిన యేసయ్య నా రక్షకుడు
అ. పల్లవి: సంతోషమే ఇక ఆనందమే ఎల్లవేళలా నిన్ను కీర్తించెద
1. కృంగిన వేళలో శక్తితో నన్ను నింపి
మదనపడే వేళ కన్నీటిని తుడిచి
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి
విడువక నాయెడల కృప చూపించెన్ "సంతోషమే"
2. అలసిన వేళ లో నన్ను లేవనెత్తి
నలిగిన సమయంలో నన్ను ఓదార్చి
భయపడకుము నీ తోడుగా నేనున్నానని
బలపరిచి నడిపించిన నా విమోచక "సంతోషమే"