ghana bhava dhupakruthu lanu mఘన భవ దుపకృతు లను మాటికి నే వి
Chords: ragam: ఆనందభైరవి-aanMdhabhairavi
ఘన భవ దుపకృతు లను మాటికి నే వినుతింతును దే నిజసుత
యొనరఁగ నాపై ననుక్రోశముఁదగ నునుపవే క్రైస్తవ జన విహిత||ఘన||
1. ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా
పారముఁదప్పిన పాతకు నగు నే నారడివడ నీ కది బిరుదా||ఘన||
2.
జలబుద్బుదముతో సమ మని నాస్థితి తెలియద నీకది దేహధరా
ఖలమయ మగు నీ కర్మినిఁబ్రోవను సిలువను బొందిన శ్రేయఃకరా||ఘన||
3.
మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ సు నంద
నా యందముగా నా డెందము కడుఁదెలి వొందఁగ నీ దయ నందు మా ||ఘన||