yaesu bhajanayae manalanu aa sయేసు భజనయే మనలను ఆ సుగతికిఁ దీ
యేసు భజనయే మనలను ఆ సుగతికిఁ దీయు జనులారా దాసజనులు
జేయు పలు దోసములు మోయు ||యేసు||
1. మేల కులశీల వ్రత జా లాధిక మేల చాల మన మీలాగునఁ
గాలావధి ఁగూల||యేసు||
2. అక్షయ కరుణేక్ష భువన రక్షణ ఖల శిక్షా ధ్యక్ష బుధ పక్ష కృత
మోక్ష యను దీక్షన్||యేసు||
3. మాటికి మిన్నేటికిఁ బో నేటికిఁ గాల్ నొవ్వ సూటిగ నరకోటి దురిత
వాటములను మీటు||యేసు||
4. శ్రోత్రమ యపవిత్ర నర చ రిత్రలు వినఁబోక మైత్రిని బరమాత్ముని కథ
మాత్రము విను మనుచున్||యేసు||
5. మన జీవనమునకు మారుగఁ తన ప్రాణము నిచ్చెన్ తన రక్తముచేఁ
బావన మొనరించెను మనలన్||యేసు||
yaesu bhajanayae manalanu aa sugathikiAO dheeyu janulaaraa dhaasajanulu
jaeyu palu dhoasamulu moayu ||yaesu||
1. maela kulasheela vratha jaa laaDhika maela chaala mana meelaagunAO
gaalaavaDhi AOgoola||yaesu||
2. akShya karuNaekSh bhuvana rakShNa khala shikShaa DhyakSh buDha pakSh krutha
moakSh yanu dheekShn||yaesu||
3. maatiki minnaetikiAO boa naetikiAO gaal novva sootiga narakoati dhuritha
vaatamulanu meetu||yaesu||
4. shroathrama yapavithra nara cha rithralu vinAOboaka maithrini baramaathmuni kaTha
maathramu vinu manuchun||yaesu||
5. mana jeevanamunaku maarugAO thana praaNamu nichchen thana rakthamuchaeAO
baavana monariMchenu manalan||yaesu||