jeevithammtha nee praemagaanm జీవితమంత నీ ప్రేమగానం ప్రణుతిం
జీవితమంత నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుదేవా
ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో ||జీవిత||
1. సర్వసమయములలో నీ స్తుతిగానం ఎల్లవేళలయందు
నీ నామధ్యానం మాకదియే మేలు ఈ జీవితమున స్తుతియింతు నా
రక్షకా ||జీవిత||
2. సృష్టినంతటిని నీ మాటచేత సృజియించితివిగా
మా దేవ దేవా నీ ఘనమగు మహిమన్ వర్ణింపతరమా
స్తుతియింతు నా రక్షకా ||జీవిత||
3. కలుషాత్ములైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు
నర్పించితివిగా కల్వరిగిరిపై చూపిన ప్రేమన్ స్తుతియింతు
నా రక్షకా ||జీవిత||
4. పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీరాజ్యంబులో
ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా స్తుతియింతు నా రక్షకా ||