naa nimiththamaayana mahini shనా నిమిత్తమాయన మహిని శ్రమలు పొ
నా నిమిత్తమాయన మహిని శ్రమలు పొందెను
ఘనధనముల రోసెను అనుమతించె చావుకు
1. నా నిమిత్తమె (3) మరణ మాయెను
తన జీవమును నాకు బలిగా ధారపోసెను ||నా నిమి||
2. గొఱ్ఱెపిల్ల రీతిగా గొప్ప శాంతి జూపెను
ఉర్వినంత మోపినన్ యోర్చె మౌనవృత్తిని ||నా నిమి||
3. అతడు దోషమెరుగడు అతడు కపటమెరుగడు
అయినను దేవుడు అతని నలుగగొట్టెను ||నా నిమి||
4. అతడు యిలను పొందిన అధిక దెబ్బలవలన్
క్షితిని నాకు కలిగెను స్వస్థత మది రూఢీగా ||నా నిమి||
5. రోగముల్ భరించెను వ్యసనములు వహించెను
బాగుగా నొత్తిడిన్ బాధలన్ సహించెను ||నా నిమి||
6. గాయములను పొందెను కాయమంత నొచ్చెను
హేయమైన నిందలన్ ఎలమిలో సహించెను ||నా నిమి||
7. ఎదిగె నాయన మన యెడల దీన వృత్తిని
సదనులమగు ప్రీతితో సరకు చేయమైతిమి ||నా నిమి||
8. తన యనుభవమున్ మనల దోషరహితులన్
చేయ నుద్దేశించెన్ ప్రాణమర్పించెను ||నా నిమి||