naa priya yaesunipai aanukoni నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్
నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున
నడుచుటయే ఆనంద జీవితము ||నా||
1. లిల్లిపుష్పం షారోనురోజ పరిశుద్ధమైన మాదు తండ్రి
పూర్ణరూప సౌందర్యుడే కీర్తింపతగిన దేవ ||నా||
2. కన్యకలు ప్రేమించుదేవ నా ప్రభునామము పరిమళమే
యేసుని వెనుక వచ్చితిమి నన్ను ఆకర్షించెను ||నా||
3. ప్రేమధ్వజ మెగురుచుండగ ప్రియునిసముఖము కలుగుటచే
జల్దరు వృక్షము క్రింద కలిగెను ప్రియుని ఆదరణ ||నా||
4. నిద్రించు రాత్రిసమయమునందు నిత్యం నా ఆత్మ మేలుకొని
నా తలుపు నొద్ద నిలచిన యేసుని ప్రేమించెదన్ ||నా||
5. అగ్నిజ్వాల యేసుని ప్రేమ మరణమువలె బలవంతమైనది
నీటి ప్రవాహమువలన ఆప్రేమ చల్లారదు ||నా||
6. దీనస్థంభము వలె దిగివచ్చును దేవకుమారుడు మహిమతో
ఘనులైన వారి రథమువలె పై కెగిరిపోదును ||నా||
naa priya yaesunipai aanukoni araNya maargamuna
naduchutayae aanMdha jeevithamu ||naa||
1. lillipuShpM Shaaroanuroaja parishudhDhamaina maadhu thMdri
poorNaroopa sauMdharyudae keerthiMpathagina dhaeva ||naa||
2. kanyakalu praemiMchudhaeva naa prabhunaamamu parimaLamae
yaesuni venuka vachchithimi nannu aakarShiMchenu ||naa||
3. praemaDhvaja meguruchuMdaga priyunisamukhamu kalugutachae
jaldharu vrukShmu kriMdha kaligenu priyuni aadharaNa ||naa||
4. nidhriMchu raathrisamayamunMdhu nithyM naa aathma maelukoni
naa thalupu nodhdha nilachina yaesuni praemiMchedhan ||naa||
5. agnijvaala yaesuni praema maraNamuvale balavMthamainadhi
neeti pravaahamuvalana aapraema challaaradhu ||naa||
6. dheenasThMbhamu vale dhigivachchunu dhaevakumaarudu mahimathoa
ghanulaina vaari raThamuvale pai kegiripoadhunu ||naa||