• waytochurch.com logo
Song # 2923

maargamu choopumu imtiki naa tమార్గము చూపుము ఇంటికి నా తండ్ర


మార్గము చూపుము ఇంటికి నా తండ్రి యింటికి
మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి(2)

1. పాప మమతలచేత పారిపోయిన నాకు ప్రాప్తించెక్షామము
పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమగోరుచు పంపుము
క్షేమము ప్రభు నీదు సిలువముఖము చెల్లనినాకు పుట్టించే ధైర్యము


2. ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
ధరణీభోగములెల్ల బ్రతుకు ధ్వంసముజేయ దేహి
నినుచేరితి దేహి అని నీవైపు చేతులెత్తిననాకు దారినిజూపుము ||మా||


3. దూరదేశములోన బాగుండుననుకొనుచు తప్పితి మార్గము
తరలిపోయిరి నేను నమ్మినహితులెల్ల తరిమే దారిద్ర్యము
దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి ధన్యుని జేయుము ||మా||


4. అమ్ముకొంటిని నేను అధముడొకనికి నాడు ఆకలిబాధలో
అన్యాయమయిపోయె పందులు సహవెలివేయ అలవడెను
వేదన అడుగంటె అవినీతి మేల్కొనియె మానవత
ఆశ్రయము గూర్చుము ||మా||


5. కొడుకునే కాదనుచు గృహమే చెరసాలను కోపించి
వెళ్ళితి కూలివీనిగనైన నీ యింట పనిచేసి కనికరమే
కోరుదు కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు
క్షమియించు బ్రోవుము ||మా||


6. నా తండ్రి ననుజూచి పరుగిడుచు ఏ తెంచి నాపై బడి ఏడ్చెను
నవజీవమును కూర్చి యింటికి తోడ్కొనివెళ్ళి నన్ను
దీవించెను నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో
సాక్ష్యమై యుండును ||మా||

maargamu choopumu iMtiki naa thMdri yiMtiki
maaDhurya praema prapMchamu choopiMchu kMtiki(2)

1. paapa mamathalachaetha paaripoayina naaku praapthiMchekShaamamu
pashchaaththaapamu noMdhi thMdri kShmagoaruchu pMpumu
kShaemamu prabhu needhu siluvamukhamu chellaninaaku puttiMchae Dhairyamu


2. Dhanamae sarvMbanuchu sukhamae svargMbanuchu thMdrini veedithi
DharaNeebhoagamulella brathuku DhvMsamujaeya dhaehi
ninuchaerithi dhaehi ani neevaipu chaethuleththinanaaku dhaarinijoopumu ||maa||


3. dhooradhaeshamuloana baaguMdunanukonuchu thappithi maargamu
tharalipoayiri naenu namminahithulella tharimae dhaaridhryamu
dhaakShiNyamoorthi needhaya naapai kuripiMchi Dhanyuni jaeyumu ||maa||


4. ammukoMtini naenu aDhamudokaniki naadu aakalibaaDhaloa
anyaayamayipoaye pMdhulu sahavelivaeya alavadenu
vaedhana adugMte avineethi maelkoniye maanavatha
aashrayamu goorchumu ||maa||


5. kodukunae kaadhanuchu gruhamae cherasaalanu koapiMchi
veLLithi kooliveeniganaina nee yiMta panichaesi kanikaramae
koarudhu kaadhanaku naa thMdri dhikkevvarunu laeru
kShmiyiMchu broavumu ||maa||


6. naa thMdri nanujoochi parugiduchu ae theMchi naapai badi aedchenu
navajeevamunu koorchi yiMtiki thoadkoniveLLi nannu
dheeviMchenu naa jeevitha kaThayMtha yaesu praemaku Dharaloa
saakShyamai yuMdunu ||maa||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com