• waytochurch.com logo
Song # 2926

rammu nee tharunamidhae pilacరమ్ము నీ తరుణమిదే పిలచుచున్నా


రమ్ము! నీ తరుణమిదే పిలచుచున్నాడు
నీ ప్రభువైన యేసు నొద్దకు

1. జీవితమంతయు వ్యర్థముగను దుఃఖముతోను
గడుపుటయేల వచ్చి ఆయన శరణు జొచ్చినచో
వాంఛతో నిన్ను స్వీకరించున్ ||రమ్ము||


2. కట్టిన యిల్లు ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును
గూడు విడిచి నీవు పోయినచో వెంటనీతో రారెవరు ||రమ్ము||


3. అందము మాయ అస్థిరమే దాని నమ్మకుము మోసగించును
మరణము ఒకనాడు వచ్చును మరువకు నీ ప్రభువును ||రమ్ము||


4. మిన్ను క్రిందన్ భూమి మీదన్ మిత్రుడేసు నామముగాక
రక్షణ పొందు దారిలేదు రక్షకుడేసే మార్గము ||రమ్ము||


5. తీరని పాపవ్యాధులను మారని నీదు బలహీనతల్ ఘోర
సిలువలో మోసితీర్చెన్ గాయములచే బాగుపడన్ ||రమ్ము||


6. సత్యవాక్కును నమ్మి రమ్ము నిత్యజీవమును నీకిచ్చున్
నీ పేరు జీవపుస్తకమునందు నిజముగ ఈనాడే వ్రాయున్ ||రమ్ము||

rammu! nee tharuNamidhae pilachuchunnaadu
nee prabhuvaina yaesu nodhdhaku

1. jeevithamMthayu vyarThamuganu dhuHkhamuthoanu
gaduputayaela vachchi aayana sharaNu jochchinachoa
vaaMChathoa ninnu sveekariMchun ||rammu||


2. kattina yillu DhanaDhaanyamulu kanabadu bMDhumithrulunu
goodu vidichi neevu poayinachoa veMtaneethoa raarevaru ||rammu||


3. aMdhamu maaya asThiramae dhaani nammakumu moasagiMchunu
maraNamu okanaadu vachchunu maruvaku nee prabhuvunu ||rammu||


4. minnu kriMdhan bhoomi meedhan mithrudaesu naamamugaaka
rakShNa poMdhu dhaarilaedhu rakShkudaesae maargamu ||rammu||


5. theerani paapavyaaDhulanu maarani needhu balaheenathal ghoara
siluvaloa moasitheerchen gaayamulachae baagupadan ||rammu||


6. sathyavaakkunu nammi rammu nithyajeevamunu neekichchun
nee paeru jeevapusthakamunMdhu nijamuga eenaadae vraayun ||rammu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com