ella vaelalmdhu kashtalammdhu ఎల్ల వేళలందు కష్టలమందు వల్లభు
ఎల్ల వేళలందు కష్టలమందు
వల్లభుండా యేసున్ స్తుతింతున్
ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదె వివరింప||
1. విమోచకుడా విమోచన నీవే
రక్షకుడవు నా రక్షణ నీవే ||ఎల్ల||
2. సృష్టికర్తవు సహాయము నీవే
ఇష్టుడ నీవు త్రిత్వము నీవే ||ఎల్ల||
3. జ్ఞానము నీవే నా పానము నీవే
దానము నీవే నా గానము నీవే ||ఎల్ల||
4. జ్యోతియు నీవే నా నీతియు నీవే
ఆదియు నీవే నా అంతము నీవే ||ఎల్ల||
5. నిత్యుడ నీవే నా సత్యుండ నీవే
స్తోత్రము నీవే నా నేత్రము నీవే ||ఎల్ల||
6. జీవము నీవే నా దేవుడు నీవే
పావన మీవే నా కావలి నీవే ||ఎల్ల||
7. కాంతియు నీవే నా శాంతియు నీవే
సంతస మీవే నా కంతయు నీవే ||ఎల్ల||