rmdi suvaartha sunaadhamuthoa రండి సువార్త సునాదముతో రంజిలు
రండి సువార్త సునాదముతో
రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో
ప్రభుయేసు దయానిధి సన్నిధికి
1. యేసే మానవ జాతి వికాసం
యేసే మానవ నీతి విలాసం
యేసే పతిత పావన నామం
భాసర క్రైస్తవ శుభనామం
||రండి||
2. యేసే దేవుని ప్రేమ స్వరూపం
యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం
ఆశ్రిత జనముల సుఖవాసం
||రండి||
3. యేసే సిలువను మోసిన దైవం
యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం
దాసుల ప్రార్థన సహకారం
||రండి||
4. యేసే సంఘములో మనకాంతి
యేసే హృదయములో ఘనశాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి
పసిపాపల దీవెన మూర్తి
||రండి||
5. యేసే జీవన ముక్తికి మార్గం
యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శంతికి సూత్రం
వాసిగ నమ్మిన జనస్తోత్రం.
||రండి||
rMdi suvaartha sunaadhamuthoa
rMjilu siluva ninaadhamuthoa
thMbura sithaara naadhamuthoa
prabhuyaesu dhayaaniDhi sanniDhiki
1. yaesae maanava jaathi vikaasM
yaesae maanava neethi vilaasM
yaesae pathitha paavana naamM
bhaasara kraisthava shubhanaamM
||rMdi||
2. yaesae dhaevuni praema svaroopM
yaesae sarvaeshvara prathiroopM
yaesae prajaapathi paramaeshM
aashritha janamula sukhavaasM
||rMdi||
3. yaesae siluvanu moasina dhaivM
yaesae aathmala shaashvatha jeevM
yaesae kShmaapaNa aDhikaarM
dhaasula praarThana sahakaarM
||rMdi||
4. yaesae sMghamuloa manakaaMthi
yaesae hrudhayamuloa ghanashaaMthi
yaesae kutuMba jeevana jyoathi
pasipaapala dheevena moorthi
||rMdi||
5. yaesae jeevana mukthiki maargM
yaesae bhakthula bhoothala svargM
yaesae prapMcha shMthiki soothrM
vaasiga nammina janasthoathrM.
||rMdi||