yaesu naama memthoa madhurm yaయేసు నామ మెంతో మధురం యేసు నామ
Chords: ragam: మారవ-maarav
యేసు నామ మెంతో మధురం యేసు నామ మెంతో మధురం
దోసములు మోసములు నాధ మొనరించు ప్రభు ||యేసు||
1. స్వాంతమునకు శాంతి నిడును చింతలను భ్రాంతులను వింతలుగఁ
ద్రుంచు ప్రభు ||యేసు||
2. నెమ్మి జేయు కమ్మివేయు నమ్మికలు సొమ్ములుగ ముమ్మరము జేయు
ప్రభు ||యేసు||
3. ప్రేమ లెదుగ క్షేమ మొదపు కామ గుణ పామరతి లేమి చొరనీదు
ప్రభు ||యేసు||
4. మోక్ష దశకు సాక్ష్య మొసఁగు నక్షయ సురక్షణకు దక్షత వహించ
ప్రభు ||యేసు||
5. శీల మతుల పాలి వెతలఁ తూలఁ జనఁదోలి తన జాలి కనపరచు
ప్రభు ||యేసు||