shree yaesu dhivya naamasmaranశ్రీ యేసు దివ్య నామస్మరణ చేయవే
శ్రీ యేసు దివ్య నామస్మరణ చేయవే మనసా
పాయక స్మరియించి పరము పొందువే మనసా ||శ్రీ||
1. నరుల పాప హరణమునకై నరుడయ్యె మనసా
పరమ పుర ద్వారంబు మనకు తెరచెనే మనసా ||శ్రీ||
2. నరుల పాప శాప ఫలము నరకమే మనసా
ఆ మరణమును తొలంచప్రభువే నుడిసె నేమనసా ||శ్రీ||
3. పాపమునకు ప్రాయశ్చిత్తం భవ్యమే గదా
ప్రభువే ప్రాయశ్చిత్త బలియై పరగెనే మనసా ||శ్రీ||
4. సిలువవేసి ప్రభుని ప్రజలు చంపిరే మనసా
ఆ బలుడు తిరిగి లేచి మృతిని గెలిచేనే మనసా ||శ్రీ||
5. గెలిచి యేసు హితులమధ్య నిలిచెనే మనసా
నిలిచి సమాధాన మంచు పలికెనే మనసా ||శ్రీ||
6. పునరుత్థాన మేసు దేవ పుత్రుడని మహా
ఘనముగా ప్రకటించుచుండ కాననే మనసా ||శ్రీ||
7. తానె మార్గం తానెసత్యం తానెజీవము
ఈ ఘన సత్యంబు నమ్మునరులు ధన్యులే మనసా ||శ్రీ||
8. నిన్ను నీ వెరింగి ప్రభుని నెరుగ వే మనసా
సన్నుతు డందుల కొసంగె సత్యవేదము ||శ్రీ||
9. పాపములకు పరితపించి ప్రభుని జేరవే
దాపునకు రమ్మంచు కరము చాపేనే మనసా ||శ్రీ||
10. ఎంత ఘోరపాపమైన నెంచడే మనసా
ఎంత మొత్తమైనను క్షమి యించునే మనసా ||శ్రీ||
11. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించు మనసా
ఈ బతుక్నందె ప్రభుని పదము పట్టుకో మనసా ||శ్రీ||
12. జనక కుమారాత్మ దేవున్ జపియించు మనసా
అనయమును స్మరించు స్వర్గ మద్దియే మనసా ||శ్రీ||
shree yaesu dhivya naamasmaraNa chaeyavae manasaa
paayaka smariyiMchi paramu poMdhuvae manasaa ||shree||
1. narula paapa haraNamunakai narudayye manasaa
parama pura dhvaarMbu manaku therachenae manasaa ||shree||
2. narula paapa shaapa phlamu narakamae manasaa
aa maraNamunu tholMchaprabhuvae nudise naemanasaa ||shree||
3. paapamunaku praayashchiththM bhavyamae gadhaa
prabhuvae praayashchiththa baliyai paragenae manasaa ||shree||
4. siluvavaesi prabhuni prajalu chMpirae manasaa
aa baludu thirigi laechi mruthini gelichaenae manasaa ||shree||
5. gelichi yaesu hithulamaDhya nilichenae manasaa
nilichi samaaDhaana mMchu palikenae manasaa ||shree||
6. punaruthThaana maesu dhaeva puthrudani mahaa
ghanamugaa prakatiMchuchuMda kaananae manasaa ||shree||
7. thaane maargM thaanesathyM thaanejeevamu
ee ghana sathyMbu nammunarulu Dhanyulae manasaa ||shree||
8. ninnu nee veriMgi prabhuni neruga vae manasaa
sannuthu dMdhula kosMge sathyavaedhamu ||shree||
9. paapamulaku parithapiMchi prabhuni jaeravae
dhaapunaku rammMchu karamu chaapaenae manasaa ||shree||
10. eMtha ghoarapaapamaina neMchadae manasaa
eMtha moththamainanu kShmi yiMchunae manasaa ||shree||
11. brathuku shaashvathMbu kaadhu parikiMchu manasaa
ee bathuknMdhe prabhuni padhamu pattukoa manasaa ||shree||
12. janaka kumaaraathma dhaevun japiyiMchu manasaa
anayamunu smariMchu svarga madhdhiyae manasaa ||shree||