dhraakshaavallini naenu dhraakద్రాక్షావల్లిని నేను ద్రాక్షాత
ద్రాక్షావల్లిని నేను ద్రాక్షాతీగెలు మీరు అక్షయు డేసిటు బలికె
అతిముదమునను వినరండి ||ద్రాక్షా||
1. నాయందుండని తీగె నాశనమొందును నిజము నాశనమొందక మీరు
నాయందుండుడి ఫలియింపన్ ||ద్రాక్షా||
2. ఫలముల నివ్వని తీగె పనికిరాదని నరికి పారవేయంబడును నిరతము
తధ్యము నిప్పులలో ||ద్రాక్షా||
3. ఫలించు ప్రతి తీగె ఫలముల పెక్కుగ నివ్వన్ పరిశుద్ధి చేయబడున్
యెఱుగరే మీరది అనవరతం ||ద్రాక్షా||
4. నాయందుండినగాని నయమగు కాపుండదిలన్ నాయందుండిన వాడు
నాణ్యపు ఫలములనిచ్చు నాహా ||ద్రాక్షా||
5. మీరు యేదియు చేయ లేరు నాకు వేరై వేరుగ మీరుండినచో
వెంటనే యెండిపోయెదరు ||ద్రాక్షా||
6. కాన యేసుని యందు మానకనుందుము స్వేచ్ఛన్ మాన్యుడేసుని
పలుకుల్ మదిదలచెద మిల మరువకను ||ద్రాక్షా||
dhraakShaavallini naenu dhraakShaatheegelu meeru akShyu daesitu balike
athimudhamunanu vinarMdi ||dhraakShaa||
1. naayMdhuMdani theege naashanamoMdhunu nijamu naashanamoMdhaka meeru
naayMdhuMdudi phliyiMpan ||dhraakShaa||
2. phlamula nivvani theege panikiraadhani nariki paaravaeyMbadunu nirathamu
thaDhyamu nippulaloa ||dhraakShaa||
3. phliMchu prathi theege phlamula pekkuga nivvan parishudhDhi chaeyabadun
yeRugarae meeradhi anavarathM ||dhraakShaa||
4. naayMdhuMdinagaani nayamagu kaapuMdadhilan naayMdhuMdina vaadu
naaNyapu phlamulanichchu naahaa ||dhraakShaa||
5. meeru yaedhiyu chaeya laeru naaku vaerai vaeruga meeruMdinachoa
veMtanae yeMdipoayedharu ||dhraakShaa||
6. kaana yaesuni yMdhu maanakanuMdhumu svaechChan maanyudaesuni
palukul madhidhalachedha mila maruvakanu ||dhraakShaa||