ఆశ్రయుడా నా యేసయ్య
Ashrayuda Naa Yesayya
ఆశ్రయుడా నా యేసయ్యస్తుతి మహిమప్రభావము నీకేనయ్యా (2)విశ్వవిజేతవు – సత్యవిధాతవునిత్యమహిమకు ఆధారము నీవు (2)లోకసాగరాన కృంగినవేళనిత్యమైనకృపతో వాత్సల్యము చూపినను చేరదీసిన నిర్మలుడానీకేనయ్యా ఆరాధనానీకేనయ్యా స్తుతిఆరాధనా (2) ||ఆశ్రయుడా||1. తెల్లని వెన్నెలకాంతివి నీవుచల్లని మమతల మనసే నీవు (2)కరుణనిచూపి కలుషముబాపినను ప్రేమించిన ప్రేమవు నీవు (2)జనులకు దైవం జగతికి దీపంనీవుగాక ఎవరున్నారు ?నీవే నీవే ఈ సృష్టిలోకొనియాడబడుచున్న మహరాజువు (2) ||ఆశ్రయుడా||2. జీవితదినములు అధికములగుననివాగ్దానముచేసి దీవించితివి (2)ఆపత్కాలమున అండగనిలిచిఆశలజాడలు చూపించితివి (2)శ్రీమంతుడవై సిరికే రాజువైవ్యధలనుబాపి నా స్థితిమార్చితివిఅనురాగమే నీ ఐశ్వర్యమాసాత్వికమే నీ సౌందర్యమా (2) ||ఆశ్రయుడా||3. నీ చిత్తముకై అరుణోదయమునఅర్పించెదను నా స్తుతిఅర్పణ (2)పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయొక్కమహిమైశ్వర్యము నేపొందుటకు (2)ప్రతివిషయములో స్తుతి చెల్లించుచుపరిశుద్ధాత్మలో ప్రార్థించెదరుపరిశుద్ధుడా పరిపూర్ణుడానీ చిత్తమే నాలో నెరవేర్చుమా (2) ||ఆశ్రయుడా||