కురిసింది తొలకరి వాన నా గుండెలోన
Tolakarivaana na gundelona
కురిసింది తొలకరి వాన నా గుండెలోన (2)చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై (2)నీ నిత్య కృపయే వాత్సల్యమైనీ దయయే హెర్మోను మంచువలే (2)పొంగి పొరలి ప్రవహించే నా జీవితానఆనందించి ఆరాధించెద నా యేసయ్య (2) || కురిసింది ||1. దూలినై పాడైన ఎడారిగా నను చేయకజీవజల ఊటలు ప్రవహింపజేశావు (2)కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయకసాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు (2)స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయాసాగరా (2) || పొంగి పొరలి ||2. నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసినా చీల మండలమునకు సౌందర్యమిచ్చితివి (2)నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయకనీ ప్రభావ మేఘముతో సాక్షిగ నను నడిపితివి (2)తడిసి మునిగి తేలెదనయ్యా ప్రేమ సాగరా (2) || పొంగి పొరలి ||3. నా తొలకరి వర్షము నీవై చిగురింపజేసావునా ఆశల ఊహలలో విహరింపజేశావు (2)నా కడవరి వర్షము నీవై ఫలింపజేసావునీ మహిమ మేఘములో నన్ను కొనిపోయెదవు (2)హర్షధ్వనులతో హర్షించెదను కరుణా సాగర (2) || పొంగి పొరలి ||